మనం ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేము. అలాంటిది దేశం కోసం సింధు ఎన్నో త్యాగాలను చేసింది. 2016లో రియో ఒలింపిక్స్‌లో ఆమె సిల్వర్ మెడల్ నెగ్గింది. ఆ ఒలింపిక్స్‌కు సాధన చేసే సమయంలో కోచ్ పుల్లెల్ గోపీచంద్ సలహా మేరకు ఓ నిర్ణయం తీసుకుంది. ట్రెయినింగ్ మీద మరింత ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో సింధు మూడు సంవత్సరాలు తన ఫోన్‌ను పక్కనపెట్టింది.