ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల జాబితా వెల్లడైంది. ఈ దేశాల్లో సింగపూర్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ దేశ పాస్‌పోర్టుతో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశముంది. ఇక ఈ లిస్టులో భారత్ 80వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించిన వివరాల ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఇండెక్స్ ఈ జాబితాను వెల్లడించింది.