TG: కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.1.25 కోట్ల పరిహారం చెల్లించేలా ప్రమాద బీమా పథకం అమలుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)తో ఒప్పందం చేసుకున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఉద్యోగి సాధారణ మరణం పొందితే రూ.10 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం జరిగిందన్నారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.40 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు సీఎండి తెలిపారు. ఇది నేటినుంచే (గురువారం) అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఎండీ అశోక్ తెలిపారు.