TG: సింగరేణి అధికారులు బుధవారం ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో తవ్వకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల సింగరేణి సంస్థ తొలిసారిగా ఒడిశాలో బొగ్గు గనిని ప్రారంభించడం సాధ్యమైందన్నారు. ఇది రాష్ట్ర సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనమని, నైనీ గనిని ప్రారంభించడం సింగరేణి సంస్థ కొత్త శకానికి నాంది అంటూ పేర్కొన్నారు.