సింగర్ ప్రవస్తి తాజాగా సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సింగర్ సునీత స్పందించారు. ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు నిజం కాదంటూ ఖండించారు. 'ప్రవస్తి నిన్ను నేను బాల్యంలో ముద్దుచేశా. ఈ వయసులో అలా చేస్తే బాగుండదు. కానీ మా గురించి చర్చించే స్థాయికి నువ్వు వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది. ఆడియన్స్‌కు అన్ని విషయాలు చెప్పు' అంటూ పేర్కొన్నారు.