SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి ఎప్పుడూ లాభదాయకమే. మార్కెట్లో తాత్కాలిక హెచ్చుతగ్గులు ఉన్నా, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి పెద్దగా ప్రభావం చూపవు. మార్కెట్ తగ్గితే SIP ఆపడం, పెరిగితే తిరిగి మొదలుపెట్టడం సరికాదు. పెట్టుబడి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిరంతరం మదుపు కొనసాగాలి. ఐదేళ్లకు మించి పెట్టుబడులు 12-13% సగటు రాబడి ఇస్తాయి. నష్టాలకైనా, లాభాలకైనా ఓర్పుతో, అవగాహనతో పెట్టుబడి కొనసాగించాలి.