అమరావతిలోని సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 6వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. దాదాపు 35 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్న, గొట్టిపాటి, దుర్గేష్, వాసంశెట్టి, సీఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.