ధర్మపురి దేవస్థానంలో భక్తుల తాకిడి

58చూసినవారు
ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి వేకువ జామునే తరలివచ్చిన భక్తులు ముందుగా స్థానిక గోదావరి నది తీరాన స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :