గడపగడపకు బిజెపి

1522చూసినవారు
గడపగడపకు బిజెపి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 8 సంవత్సరాల సుపరిపాలలో భాగంగా గడప గడపకు బిజెపి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై జమ్మికుంట పట్టణ శాఖ గురువారం బిజెపి పట్టణ, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు కటుకోజుల హారిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, బిజెపి జిల్లా కార్యదర్శి మంజుల వాణి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, వైస్ ఎంపీపీ అరెల్లి జ్యొష్న, ఇల్లందకుంట మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు 8 సంవత్సరాల సమయంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రం ప్రతి గడప గడపకి పంచాలని, ప్రతి ఒక్క వ్యక్తికి బిజెపి ప్రభుత్వం చేసే అభివృధి, మనకు వచ్చే పథకాలు పట్ల అవగాహన కల్పించాలని కోరారు. గ్రామంలోని ప్రతి గడప తిరిగి అందరికి అవగాహన కల్పించారు. గ్రామంలోని మహిళలకు ప్రజలకు అవగాహన కల్పించారు.

సులభతర జీవనం ప్రతి పౌరుడి హక్కు అందుకే ఇది మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అనే మోడీ కళలను సాకారం చేసె విధంగా దేశం ముందుకు పోతుందని కోరారు. 80 కోట్ల మంది ప్రజలకు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార దాన్యాలు, 18 కోట్లకు పైగా అయుష్మాన్ భారత్ కార్డులు జారి అయ్యాయని అన్నారు. గత 8 సంవత్సరాలలో 15 కొత్త ఏ. ఐ. ఐ. ఎం. ఎస్ ప్రారంభం, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజిల నిర్మాణం, పీఎం కిసాన్ సమ్మన్ నిధి కింద 11. 3 కోట్ల రైతు కుటుంబాలకు 1. 82 లక్షల కోట్ల రూపాయలు అందించారన్నారు.

ఆపరేషన్ గంగా, ఆపరేషన్ రహత్ కింద యుద్ధ క్షేత్రల నుంచి భారతీయుల సురక్షిత తరలింపు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 9 కోట్లు మంది మహిళలకు ఎల్. పి. జి కనెక్షన్లు వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరెల్లి జ్యొష్న, జిల్లా కార్యదర్శి మంజుల వాణి, కనుమ లక్ష్మి, కొండ్రే సులోచన, మైస భాగ్య, వేముల మంజుల, ఇట్టు శోభ, గడ్డం స్వాతి, భోగం రవళి, మాదాడి కావ్య, వేముల భారతి, భావనపెళ్లి అశ్విని, గడ్డం స్వప్న, కత్తుల స్వరూప, మంద రజిత, బోడ రత్నమాల, జోలపురం శ్రావణి, కనుమల్ల రమ్య, నక్కల మనక, ఎలుక సారమ్మ, శ్రీపతి మంజుల, తాళ్లపెళ్లి సుజాత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :