జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఆదివారం దళితబందు రెండో విడుత లబ్ధిదారులు అర్ధనగ్న ప్రదర్శన నిరసన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పేరిట అర్హులైన వారిని గుర్తించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. వెంటనే అర్హులైన దళిత బందు లబ్ధిదారులకు డబ్బులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత డబ్బులు ఇవ్వకుంటే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.