హుజూరాబాద్: ఎమ్మెల్యేపై దాడి చేయడం హేయమైన చర్య: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

74చూసినవారు
హుజూరాబాద్: ఎమ్మెల్యేపై దాడి చేయడం హేయమైన చర్య: ఎమ్మెల్సీ కోటిరెడ్డి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అతని అనుచరులపై అక్కడ పోలీసులు శనివారం దాడి చేయడం హేయమైన చర్య అని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు అందించారన్నారు. ఆ విషయాన్ని అడిగితే పోలీసులు దాడి చేస్తారా అన్నారు.

సంబంధిత పోస్ట్