కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమైంది. హుజురాబాద్ నియోజకవర్గంలో 5 మండలాల్లో 305 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 250429, 121809 పురుషులు, 128613 స్త్రీలు, ఇతరులు 7 గురు ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.