జగిత్యాల: తల్లిని బతికుండగానే స్మశానంలో వదిలేసిన కొడుకులు

67చూసినవారు
కన్నతల్లిని బతికుండగానే కసాయి కొడుకులు స్మశానంలో వదిలేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఎనిమిది రోజులుగా వృద్ధురాలు రాజవ్వ జగిత్యాల పట్టణ మోతె స్మశాన వాటికలోనే ఉంటున్నారు. పెన్షన్ డబ్బుల కోసం కొడుకులు కొట్టారని.. నలుగురు కొడుకులున్న లాభం లేదని రాజవ్వ రోదిస్తుంది. సంక్షేమశాఖ అధికారులకు రాజవ్వను ఆసుపత్రికి తరలించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ అధికారి నరేష్ బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్