రామగుండం- 3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని వివిధ గనులు, విభాగాలలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మెడికల్లీ ఇన్వాలిడేటెడ్ అయిన, మృతి చెందిన ఉద్యోగులకు సంబంధించి 23 కారుణ్య నియామక ఉద్యోగాల ఉత్తర్వులను శుక్రవారం జీఎం కార్యాలయంలో ఆర్జీ- 3 జీఎం సుధాకరరావు, ఏపిఏ జీఎం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈకార్యక్రమంలో వివిధ ఏరియాల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.