భారీ వర్షాలకు ప్రజలెవరు బయటకు రావద్దని పెద్దపల్లి ఏసిపి కృష్ణ అన్నారు. ఆదివారం పెద్దపల్లి మండలం సబ్బితం గౌరిగుండాల జలపాతం, పెద్దబొంకూర్, దస్తగిరిపల్లి, కొత్తపల్లిలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. భారీ వర్షం కారణంగా జలపాతాన్ని సందర్శించకుండా వార్న్ ఫ్లెక్సీలు, బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకూడదని, ఆపద సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.