మాదిగలను సీఎం రేవంత్ రెడ్డి అణిచివేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆదివారం పెద్దపల్లి అమర్ చంద్ కళ్యాణ మండపంలో మాదిగ శక్తి ఆద్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మోత్కుపల్లి, ఓయూ ప్రొఫెసర్ కాసిం, హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులు విఠల్ హాజరయ్యారు. ఈసమావేశంలో మాదిగశక్తి రాష్ట్ర ప్రధానకార్యదర్శి రజిని పాల్గొన్నారు.