
పెద్దపల్లి: సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్ ను ముట్టడించిన ఆశాలు
ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు బుధవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ను ముట్టడించారు. రూ. 18 వేలు వేతనం నిర్ణయించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జ్యోతి, సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.