75వ వన మహోత్సవం లో భాగంగా బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమంలో రామగుండం పోలీసులు పాల్గొనడం అభినందనీయమని ప్రతి ఒక్కరు మొక్కల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని సిపి ఎం శ్రీనివాస్ సూచించారు. కమిషనరేట్ పరిధిలోని అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ పాల్గోన్నారు.