ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అభివృద్ధి కమిటీ ద్వారా చర్చించి పరిష్కరించాలని సూచించారు.