రుద్రంగి గ్రామానికి చెందిన మంచె శ్రీనివాస్ తన చిత్రకళతో ప్రకృతిని అభివ్యక్తం చేస్తూ అందరి మనసుల్ని గెలుచుకుంటున్నాడు. బాల్యంలోనే చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకున్న ఆయన, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన అనేక చిత్రకళ ప్రదర్శనల్లో పాల్గొని అనేక అవార్డులను అందుకున్నాడు. ప్రకృతి, పశుపక్ష్యాదులు, గ్రామీణ దృశ్యాల చిత్రణలో ప్రత్యేక శైలి కలిగిన శ్రీనివాస్ కళలో జీవం నింపుతున్నాడు.