రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో బుధవారం బతుకమ్మ సందడి మిన్నంటేలా మొదలైంది. ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో ఆటపాటలతో పూల పండుగ చేసుకుంటున్నారు. ఎంగిలి బతుకమ్మ పాటలు పాడుతూ అన్ని దేవుళ్లను తలుస్తూ గౌరమ్మను కొలుస్తూ ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.