సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ కి మెమోరండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు కళాల శ్రీనివాస్ తో పాటు స్టేట్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.