చంద్రంపేట శివారులోని సంజీవయ్య నగర్ యువజన సంఘం సంబంధించిన సర్వే నెంబరు 1456/1 ప్రభుత్వ భూమిలో 35 గుంటల భూమిని స్మశాన వాటికకు కేటాయించారు. కొందరు భూకబ్జాదారులు, కొన్ని పార్టీల రాజకీయ నాయకులు భూములను విక్రయిస్తున్నారు. ఈ భూములపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి, తగు చర్యలు తీసుకోవాలని సంజీవయ్య నగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.