చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాలలో గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు గురువారం ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు కట్కూరి ముఖేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన అర్హత కలిగిన ఉపాధ్యాయులే విద్యను బోధిస్తున్నారని పేర్కొన్నారు.