వేములవాడ పట్టణంలోని రెడ్డి సంఘ భవనంలో రూమ్ కిరాయి తీసుకొని పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పట్టణ ఎస్సై రమేష్ మరియు పోలీస్ సిబ్బంది పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఇందులో దొమ్మటి రాజు, దొమ్మటి కిషోర్, చదువుల సుధాకర్, గోనె నాగరాజు మరియు పల్లె సంతోష్ రెడ్డి అను నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 12, 200 నగదు మరియు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు.