రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో ఆదివారం చెరిపేల్లి స్వామికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం సహాయనిధి చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరీనేని ప్రసాద్ రావు, కూడెల్లి ప్రవీణ్ కుమార్, మారబోయిన బాబు, అనంత సుధాకర్, శివంది శ్రీనివాస్, రాసమల్ల ఎల్లయ్య పాల్గొన్నారు.