రక్షణ శాఖ మంత్రిత్వ కార్యాలయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బుధవారం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
ని కలిసి సిరిసిల్ల లేదా హుస్నాబాద్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. సైనిక్ స్కూల్ ఏర్పాటు వల్ల స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు నాయకత్వ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ సమైక్యత మరియు దేశభక్తి భావన పెంపొందుతుంది అన్నారు.