గంభీరావుపేట్: వ్యవస్థను మెరుగుపరచుకోవాలి: ఎస్పీ

56చూసినవారు
గంభీరావుపేట్: వ్యవస్థను మెరుగుపరచుకోవాలి: ఎస్పీ
గ్రామాలలో పోలీసు అధికారులు సిబ్బంది పర్యటిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతె అన్నారు. గంభీరావుపేట్, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయల్ 100 కు కాల్స్ వస్తే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని రౌడీ, హిస్టరీ షీటర్స్ పై నిఘా ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్