తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో బుధవారం ప్రైమరీ స్కూల్ ఆవరణలో, గ్రామ పంచాయతీ ఆవరణలో అంగన్వాడి భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ మాట్లాడుతూ ఇట్టి భవన నిర్మాణాల మంజూరు కి తోడ్పాటు అందించిన కేకే మహేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.