రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లింగపూర్ గ్రామానికి చెందిన ఒక దివ్యాంగుడు తాను అనాథనని, ఎమ్మెల్యే తనను కనికరించి తనకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేపించాలని శనివారం కోరారు. తన తల్లి తండ్రులు కట్టించిన ఇల్లు వర్షం కారణంగా కూలిపోయిందని, తన వివరాలు తెలుసుకుని తనకు ఇల్లు మంజూరు చేపించాలని వేడుకుంటున్నారు .