విద్యుత్ స్తంభాలు తొలగించాకే రోడ్డు విస్తరణ పనులు చేయాలని బిజెపి సీనియర్ నాయకుడు మేకల మల్లేశం అన్నారు. ఇల్లంతకుంటలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.