పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు నమ్మకం, భరోసా కలిగించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. ఇల్లంతకుంట లోని పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోలింగ్ సమయంలో తప్పనిసరిగా రౌడీ, హిస్టరీ షీటర్లతో పాటు అనుమానిత వ్యక్తులను తనిఖీ చేస్తూ వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలన్నారు.