రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య అన్నారు. కోనరావుపేట మండలం కనగర్తి, మామిడిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్య పడవద్దని పేర్కొన్నారు.