కోనరావుపేట: చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటుంది

63చూసినవారు
కోనరావుపేట: చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటుంది
బీజేపీ పార్టీ కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటుందని కాంగ్రెస్ కొనరావుపేట మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. కోనరావుపేట మండలం పల్లిమక్త, నాగారంలలో ఆదివారం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం మార్చాలని కుట్ర చేసిన బీజేపీకి కాంగ్రెస్ పార్టీ 200 సీట్లకే పరిమితం అయ్యేలా చేసిందన్నారు. నరసయ్య, కేతిరెడ్డి, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్