సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఎంపీహెచ్ఎస్ పెద్దూరు పాఠశాలలో శుక్రవారం బడిబాటలో భాగంగా ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అధ్యాపకులు విద్యార్థులతో కలిసి ఓనమాలు దిద్దించి అక్షరాభ్యాసం పాఠాలు అందించారు. విద్యార్థి దశలో ఒకటో తరగతి ముఖ్యమని, క్రమశిక్షణతో విజయం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, తదితరులు తెలిపారు.