చందుర్తి మండలంలో బుధవారం రాత్రి చిరుజల్లులతో మొదలైన వర్షం, గురువారం ఉదయం మోస్తరుగా కురిసింది. వాతావరణ శాఖ మూడు రోజుల పాటు వర్షాభావ సూచనలు జారీ చేయగా, వర్షం ముందే రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విత్తనాల సన్నద్ధత, వరి నాట్లు మొదలుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.