ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం గూడెంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలు కాపాడుకుంటూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఉద్యమిద్దామని పేర్కొన్నారు.