సిరిసిల్ల: దేశానికి దిక్సూచి అంబేడ్కర్: ఎస్పీ

64చూసినవారు
సిరిసిల్ల: దేశానికి దిక్సూచి అంబేడ్కర్: ఎస్పీ
దేశానికి దిక్సూచి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అన్నగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశానికి రాజ్యాంగం రచించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచిపోయాడన్నారు.

సంబంధిత పోస్ట్