ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియమకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఆసక్తిగల విద్యార్థులు https: //www. joinindianarmy. nic వెబ్సైట్లో ఏప్రిల్ 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.