ఈనెల 17 నుండి భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అవగాహన సదస్సులు ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.