యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ కు బ్యాంకర్లు సహకరించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బ్యాంకర్లు, మండల ప్రత్యేక అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 29 వరకు మండల స్థాయిలో విచారణ పూర్తి చేసి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న 15 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.