గడచిన 11 సంవత్సరాలుగా దేశాన్ని భారతీయ జనతా పార్టీ సుశాసన దిశగా నడిపిస్తున్నదని సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అభివృద్ధి, పారదర్శకతతో పాటు దేశ రక్షణకూ బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు.