ప్రైవేట్ పాఠశాలలు మండల స్థాయికి విస్తరించి నియంత్రణ లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తుండగా, ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. 1వ తరగతికి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తూ, పాఠ్య పుస్తకాలు, యూనిఫారాల అమ్మకాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయన్నారు.