సిరిసిల్ల: పేదవారి ఇంటి కలను నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్: చొప్పదండి ప్రకాష్

82చూసినవారు
ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ గురువారం తెలిపారు. వివిధ వార్డుల్లో లబ్ధిదారుల భూమి పూజలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రాధాన్యంతో అమలు చేస్తోందన్నారు. రూ. 5 లక్షల విలువైన ఇండ్లను విడతల వారీగా మంజూరు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్