సిరిసిల్ల: రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యాత్ర

77చూసినవారు
సిరిసిల్ల: రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యాత్ర
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని రామరెడ్డిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శనివారం నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కె. కె. మహేందర్ రెడ్డి పాల్గొని, బలహీనవర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే యాత్ర ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ, మార్కెట్ కమిటీ, వివిధ గ్రామాల నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్