రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామపంచాయతీలో ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. రైతులు వరిధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకూడదని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.