సిరిసిల్ల: ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు విడుదల చేయాలి

72చూసినవారు
ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్ లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

సంబంధిత పోస్ట్