అప్పుల బాధతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం. సిరిసిల్ల పట్టణం సాయి నగర్ లో చేనేత కార్మికునిగా పనిచేస్తున్న మెరుగు సాగర్ (38) అప్పులు ఎక్కువగా ఉండడంతో తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడికి భార్య అస్మిత, కూతురు మధుప్రియ ఉన్నారు.