కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జామా మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మసీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జహంగీర్ మాట్లాడుతూ ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వక్ఫ్ కు సంబంధించిన భూములు ముస్లిం పెద్దలు, కోటీశ్వరులు దానాలుగా ఇచ్చిన భూములు అని అన్నారు.