ప్రభుత్వ పాఠశాలల స్వీపర్స్, స్కావెంజర్స్ యొక్క పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్, స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ యాదవ్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్ ముందు మంగళవారం స్వీపర్స్, స్కావెంజర్స్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.